Header Banner

చైనాతో అమెరికా డీల్! భారీగా తగ్గిన బంగారం ధరలు! ఒక్క రోజులోనే ..

  Sat May 03, 2025 14:24        Business

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, డాలర్ బలపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా తగ్గింది. దేశీయంగానూ ఇదే ట్రెండ్ కొనసాగింది. 10 గ్రాముల ధర 24 క్యారెట్లపై చూస్తే ఒక్కరోజులోనే రూ. 2 వేలకుపైగా పతనమైంది. అయితే, అక్షయ తృతీయ సందర్భంగా మాత్రం కొనుగోళ్లు పెరిగాయి. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు ధరల పతనాన్ని కొంతమేర నిలువరించే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: తక్కువ ధరలో అదిరిపోయే SUVలు! టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్‌లలో ఏది బెస్ట్ ?

 

అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని సానుకూల పరిణామాల నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయన్న ఆశలు చిగురించడం, డాలర్ బలపడటంతో పసిడికి ఉన్న డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. గురువారం ఉదయం ఆసియా మార్కెట్‌లో బంగారం ధర 1.30 శాతానికిపైగా క్షీణించి ఔన్సుకు (31.10 గ్రాములు) 3230 డాలర్ల స్థాయి వద్ద ట్రేడవుతోంది. దేశీయంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగా దిగొచ్చింది. గురువారం ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 2,180 తగ్గి రూ. 95,730కి చేరుకుంది. గత పది రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ. 5 వేల మేర తగ్గడం గమనార్హం.

 

ఇదే సమయంలో దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర ఒక్కరోజు రూ. 2 వేలు పడిపోగా.. ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 87,750 కి దిగొచ్చింది. దీనికి ముందటి రోజు రూ. 60 తగ్గగా అంతకుముందు రోజు రూ. 400 పెరిగింది. ఇక దానికి ముందు చూస్తే వరుసగా రూ. 620, రూ. 30, రూ. 100, రూ. 2750 ఇలా తగ్గుతూనే వచ్చింది. ఈ క్రమంలోనే 10 రోజుల వ్యవధిలో ఇక్కడ కూడా రూ. 5 వేలకుపైగా పడిపోయింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #uschinadeal #goldpricefall #marketcrash #tradetensions #economicupdate #globalmarkets